ప్రపంచ ప్రఖ్యాత బ్యాండ్ కోల్డ్‌ప్లే ‘మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్’ వరల్డ్ టూర్‌లో భాగంగా తొలిసారి భారత్‌లో కచేరీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో, ప్రారంభ ప్రదర్శన ఇచ్చిన తొలి భారతీయ గాయనిగా జస్లీన్ చరిత్ర సృష్టించారు. అయితే ఆమె ప్రదర్శన ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోవడంతో ట్రోలింగ్‌కి గురయ్యారు. నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు.
ఈ అనుభవం గురించి జస్లీన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓ మినీ డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తూ, అప్పట్లో తాను ఎదుర్కొన్న మానసిక ఒత్తిడిని వివరించారు. “ప్రదర్శన ముందు నాకు చాలా ఒత్తిడి ఉంది. నా చెవుల్లో టెక్నికల్ ఇష్యూస్ తలెత్తాయి. ఆ సమయంలో నాకేనా ఇది జరుగుతోంది అని ఆశ్చర్యం వేసింది. ఒక దశలో నేను నిజంగా చనిపోతానని అనిపించింది,” అని ఎమోషనల్‌గా చెప్పింది. అయినా ప్రదర్శన ఆపకుండా కొనసాగించానని పేర్కొంది
జస్లీన్ రెండో రోజు మాత్రం మెరుగైన ప్రదర్శన ఇచ్చి, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. “నేను స్వయంగా శిక్షణ పొందిన గాయని. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రతిరోజూ మెరుగుపడే దిశగా ముందుకు సాగుతున్నాను,” అని తెలిపింది. శేర్ షా, గల్లీబోయ్, బద్లాపూర్ లాంటి సినిమాల్లో పాటలు పాడిన జస్లీన్, తన భవిష్యత్తులో శ్రోతలకు మరింత అద్భుత అనుభవాన్ని అందించాలని ఆశించింది.

One thought on “తనపై ట్రోల్స్‌కి స్పందించిన గాయని జస్లీన్: “చనిపోతాననిపించింది””
Comments are closed.