రూ.210 నుంచి రాజ్యసభ దాకా: జయప్రద అసాధారణ ప్రయాణం!

Jayaprada journey from films to politics

ఇండియన్ సినిమాలోనే అత్యంత అందమైన ముఖంగా ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే ప్రశంసించిన జయప్రద, తన నటనతో, నాట్యనైపుణ్యంతో కోట్లాది మంది మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న గొప్ప నటి. 1970లు, 80ల దశకాల్లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగిన జయప్రద, తెలుగు సినిమాలో భూమి కోసం అనే చిత్రంలో కేవలం మూడునిమిషాల పాటలో తొలిసారిగా కనిపించారు. ఆ పాటకు ఆమెకు పారితోషికంగా ఇచ్చింది కేవలం రూ.210 మాత్రమే. కానీ అదే ఆమెకు సినీ ప్రయాణానికి గేట్వే అయింది.

అందం, అభినయం రెండూ సమపాళ్లలో కలిగి ఉన్న జయప్రద—సీనియర్ ఎన్టీఆర్ నుంచి కమల్ హాసన్‌, అమితాబ్ బచ్చన్ వరకు అగ్రహీరోల సరసన నటించి పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. తెలుగు సినిమాల్లో గ్లామర్‌తో పాటు గొప్ప భావోద్వేగ ప్రదర్శన చేసిన ఆమె, కన్నడలో డాక్టర్ రాజ్‌కుమార్‌తో హిట్ చిత్రాలు అందించగా, హిందీలో అమితాబ్, జితేంద్ర వంటి స్టార్లతో పలు బ్లాక్‌బస్టర్లు అందించారు. తమిళంలో రజనీకాంత్, కమల్ వంటి దిగ్గజాలతో నటించి అటు దక్షిణాదిలోనూ, ఇటు ఉత్తరాదిలోనూ అభిమానుల హృదయాల్లో చోటు సంపాదించారు.

1990 తర్వాత జయప్రద సినిమాలకు కొంత దూరంగా పాలిటిక్స్ వైపు మళ్లారు. తెలుగుదేశం పార్టీలో చేరడం ద్వారా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, తరువాత సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీల్లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి చెందిన నేతగా ఉన్న ఆమె, లోక్‌సభ మరియు రాజ్యసభ సభ్యురాలిగా సేవలందించారు. ఒక చిన్న పాటి డ్యాన్సర్‌గా రూ.210తో మొదలైన ఆమె ప్రయాణం, దేశ రాజకీయం వరకు కొనసాగిందంటే… జయప్రద జీవితం నిజంగా ప్రతీ ఒక్కరికీ ప్రేరణనిచ్చేదిగా మారింది.

Read More

One thought on “రూ.210 నుంచి రాజ్యసభ దాకా: జయప్రద అసాధారణ ప్రయాణం!

Comments are closed.