జగన్ తన తల్లిపై కేసులు వేశారంటూ ఆవేదన వ్యక్తం చేసిన షర్మిల, “ఆస్తుల విషయంలో జగన్ ఆత్మీయులకంటే ముందుంటారు” అని వ్యాఖ్యానించారు. అలాగే, “జగన్ నన్ను ప్రభావితం చేసే స్థాయి దాటిపోయారు. ఆయనకు ఆస్తులే ముఖ్యం అనిపిస్తోంది. మేనల్లుడు, మేనకోడలు కూడా మా ఆస్తులపై కన్నేశారు” అని ఆరోపించారు.
వక్ఫ్ బిల్లుపై వైసీపీ దుయ్యబట్టిన షర్మిల, “లోక్‌సభలో వ్యతిరేకం, రాజ్యసభలో మద్దతు — ఇది జగన్ డబుల్ స్టాండర్డ్ రాజకీయాలకు నిదర్శనం” అని విమర్శించారు. రాజ్యసభలో వైసీపీ మద్దతు జగన్ సూచనలతోనే వచ్చిందని చెప్పారు. ఓటింగ్ తర్వాత విప్ జారీ చేయడాన్ని “చరిత్రలోనే లేని నాటకాలు”గా అభివర్ణించారు.
ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులను హౌస్ అరెస్టు చేయడం కూడా తాము ఎదుర్కొంటున్న రాజకీయాల భాగమని ఆమె ఆరోపించారు. చివరగా, ప్రజా సమస్యలపై తాను మాట్లాడినప్పుడు కూడా కవరేజీ ఇవ్వాలని మీడియాను కోరారు.
Read More : వక్ఫ్ సవరణ బిల్లుపై పవన్ కల్యాణ్ స్పందన..
