ఐదుగురు మోడల్స్‌తో శృంగార వివాదం: బుక్కైన యాక్షన్ హీరో వాన్ డమ్!

Jean-Claude Van Damme scandal

ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ హీరో జీన్ క్లాడ్ వాన్ డమ్ ఇటీవల ఓ సంచలనాత్మక వివాదంలో చిక్కుకున్నాడు. రొమేనియాలో ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ టెర్రరిజం (DIICOT) విభాగానికి అతనిపై క్రిమినల్ ఫిర్యాదు అందడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. గ్యాంగ్ స్టర్ మోరెల్ బోలియా నేతృత్వంలోని ఓ క్రిమినల్ గ్రూప్ వాన్ డమ్‌కు ఐదుగురు విదేశీ మోడల్స్‌ను లైంగిక సంబంధాల కోసం బహుమతిగా సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేన్స్‌లో వాన్ డమ్ నిర్వహించిన ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో ఈ దందా జరిగినట్లు అధికారులు గుర్తించారు.

దర్యాప్తు ప్రకారం, అతనికి బహుమతిగా ఇచ్ఛిన మహిళలంతా రొమేనియన్ దేశస్తులే. క్రిమినల్ గ్రూప్ నిర్వాకం వల్ల వారు అత్యంత దుర్భర పరిస్థితుల్లో లైంగిక వేధింపులకు గురయ్యారని బాధితుల తరపు న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం వాన్ డమ్‌కి కష్టాలు తెచ్చిపెట్టడంతో పాటు, హాలీవుడ్ పరిశ్రమలోనూ కలకలం రేపుతోంది. విచారణలో అధికారులు గ్రూప్ కార్యకలాపాలపై మరిన్ని షాకింగ్ విషయాలు వెలికితీశారు.

ఇదే సమయంలో, వాన్ డమ్ మాత్రమే కాదు, గతంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఆండ్రూ, ట్రిస్టన్ టేట్‌లు కూడా రొమేనియాలో లైంగిక అక్రమ రవాణాకు సంబంధించి అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే వారిని ఇటీవల దేశం విడిచి వెళ్లేందుకు అనుమతించగా, వాన్ డమ్‌పై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు ఫలితంగా అతని రిప్యూటేషన్‌కు తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

Read More

One thought on “ఐదుగురు మోడల్స్‌తో శృంగార వివాదం: బుక్కైన యాక్షన్ హీరో వాన్ డమ్!

Comments are closed.