రైలులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు

రైలులో ప్రయాణిస్తున్న ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిపై సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 2న ఒడిషాకు చెందిన వ్యక్తి తన కుటుంబంతో కలిసి రక్సెల్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా, అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఓ దుర్మార్గుడు బాలికను వాష్‌రూమ్‌ వద్ద బంధించి లైంగికంగా వేధించాడని ఆరోపణలు వెల్లువెత్తాయి.

వేధింపులకు పాల్పడిన అనంతరం, నిందితుడు సెల్‌ఫోన్‌లో ఈ దృశ్యాలను వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఆపై బాలికను వదిలిపెట్టగా, వెంటనే తల్లిదండ్రులకు తాను ఎదుర్కొన్న విపత్కర సంఘటనను చెప్పింది

Read More : శ్రీరామనవమి సందర్భంగా పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచనలు..