కేజీఎఫ్ ప్రాంచైజీతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న యశ్ తన తదుపరి సినిమా కోసం పెద్ద ఎదురుచూపుల తర్వాత “టాక్సిక్” కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ డ్రామాను హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లీష్ లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఇంగ్లీష్ వెర్షన్ కోసం ప్రత్యేకంగా కొన్ని యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. యశ్ తో జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‌గా కనిపించనుండగా, బాలీవుడ్ నటి హుమా ఖురేషి మరో కీలక పాత్రలో కనిపించనుంది.
ఇప్పటి వరకు “టాక్సిక్” లో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోతుందనే వార్తలు పుకార్లుగా భావించినా, తాజాగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ద్వారా ఈ విషయం ధృవీకరించబడింది. ప్రస్తుత షెడ్యూల్ ముంబైలో జరుగుతుండగా, నయనతార కూడా త్వరలో చిత్రీకరణలో చేరనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. నయనతార పాత్ర యశ్ కు సోదరిగా ఉంటుందనే ప్రచారం జరుగుతున్నా, అధికారికంగా ఇంకా స్పష్టత లేదు. అయితే, ఆమె పాత్ర ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంటుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది.
“టాక్సిక్” లో నయనతార పాత్ర వింటూనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యశ్ తో స్క్రీన్ షేర్ చేయబోతున్న నయనతార, తన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయడం ఖాయం. ప్రస్తుతం తమిళంలో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, “టాక్సిక్” లో తన పాత్రతో మరోసారి అందరి మనసు దోచుకోవాలని సిద్ధమవుతోంది.

One thought on “టాక్సిక్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఎంట్రీ! యశ్‌తో కొత్త యాక్షన్ రైడ్”
Comments are closed.