ప్రధాని నరేంద్ర మోదీ గురువారం థాయిలాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ పర్యటనలో ఆయన పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొననున్నారు. థాయిలాండ్ ప్రధాని షేటోంగ్ టార్న్ షినవత్రాతో భేటీ అయి, రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై చర్చించనున్నారు.
అంతేకాకుండా, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (BIMSTEC) ఆరో శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతున్నారు. ఈ సందర్భంగా సముద్ర సహకారాన్ని మరింత ప్రోత్సహించే ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది. అలాగే కూటమిలోని సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించే దిశగా కీలక చర్చలు జరగనున్నాయి.
థాయిలాండ్‌లో బిమ్‌స్టెక్ సమ్మిట్ – ముఖ్య నేతల హాజరు
ఈ BIMSTEC సమ్మిట్‌కు థాయిలాండ్ ప్రధాని పేటోంగ్‌టార్న్ షినవత్రా, నేపాల్ ప్రధాని కేపీ ఓలి, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్, శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్య తదితరులు హాజరుకానున్నారు. 2018లో నేపాల్‌లో జరిగిన BIMSTEC శిఖరాగ్ర సమావేశం తర్వాత భౌతికంగా జరుగుతున్న మొదటి సమావేశం ఇదేనని అధికారులు పేర్కొన్నారు. గత శిఖరాగ్ర సమావేశం 2022లో కొలంబోలో వర్చువల్ ఫార్మాట్‌లో జరిగింది.

ఇదిలా ఉంటే, ప్రధాని మోదీ థాయిలాండ్ పర్యటనపై అక్కడి భారత రాయబారి నగేష్ సింగ్ స్పందించారు. మోదీ పర్యటనతో థాయిలాండ్‌లో ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొన్నదని తెలిపారు.
Read More : మార్చిలో ₹24.77 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్

One thought on “థాయిలాండ్ పర్యటనకు ప్రధాని మోదీ”
Comments are closed.