దిల్ రాజు 60వ సినిమాతో కొత్త ప్రయోగం: ఆశిష్‌కి విభిన్న పాత్రలో బిగ్ బ్రేక్

The Paradise Movie Glimpse Cost

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తమ 60వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది. దిల్ రాజు, శిరీష్ ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన సినిమాలు అందించిన ఈ సంస్థ, ఇప్పుడు కొత్త కథనంతో మరో ప్రయోగానికి సిద్ధమైంది. యువ నటుడు ఆశిష్ ఈ చిత్రంలో బోల్డ్, విలేజ్ బ్యాక్‌డ్రాప్ పాత్రలో కనిపించనున్నాడు. హైదరాబాద్ నగరంలో ఉన్న ఓ తెలంగాణ సంగీత బృందం ఆధారంగా ఈ కథ సాగనుంది. కథలో గ్రామీణ నేటివిటీ, భావోద్వేగాలు ప్రధానంగా ఉంటాయని సమాచారం.

ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా ఆదిత్య రావు గంగాసాని పరిచయం అవుతున్నాడు. కొత్త నటుల ఎంపిక కోసం చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ యాసలో మాట్లాడగలవారిని కోరుతున్నారు. మొబైల్ వీడియోలు, స్వీయ చిత్రాలు కాకుండా ప్రామాణిక వీడియోల ద్వారా ఎంపిక చేస్తారు. దర్శకుడిగా ఇదివరకు చిన్న కథలకు రచయితగా పనిచేసిన ఆదిత్య రావు, ఇప్పుడు ఈ పెద్ద నిర్మాణ సంస్థ ద్వారా తన దర్శకత్వ పయనాన్ని ప్రారంభిస్తున్నాడు. దిల్ రాజు కొత్త దర్శకులకు అవకాశమిచ్చే విషయంలో ముందుంటారని, ఈ చిత్రంలో కూడా అదే ధోరణిని కొనసాగిస్తారని చెబుతున్నారు.

యువత జీవితం, వారి కలలు, తెలంగాణ సంగీత బృందం నేపథ్యంగా ఈ చిత్రం సాగేలా ఉంటుంది. భావోద్వేగం, నిజ జీవిత సంఘటనలకు సమాంతరంగా కథని తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. నూతన కళాకారులకు ఇది మంచి ఆరంభం అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమా ఆశిష్‌కు ఓ బిగ్ బ్రేక్ అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ వెలువడనున్నాయి.

Read More

One thought on “దిల్ రాజు 60వ సినిమాతో కొత్త ప్రయోగం: ఆశిష్‌కి విభిన్న పాత్రలో బిగ్ బ్రేక్

Comments are closed.