యాంకర్‌గా ప్రసిద్ధి పొందిన ప్రదీప్, తన రెండో సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. దీపికా పిల్లి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 11న విడుదల కాబోతోంది. నితిన్ భరత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌కు ఇప్పటికే మంచి స్పందన లభించింది.
ప్రదీప్ మాట్లాడుతూ, “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సినిమాతో ఇదే పేరుండటంతో అభిమానుల నుంచి ప్రతికూల స్పందన వస్తుందని ముందే ఊహించాము. కానీ కథ డిమాండ్ చేయడంతో ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చింది, పవన్ కళ్యాణ్ టైటిల్‌ను కాపీ చేయాలనే ఉద్దేశం లేదు” అని స్పష్టం చేశారు. “సినిమా చూశాక అందరికీ ఆ విషయమే అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ లెగసీని గౌరవిస్తూ, మా సినిమా కూడా మంచి వినోదాన్ని అందిస్తుంది” అని ఆయన నమ్మకంగా తెలిపారు.
ప్రదీప్ హీరోగా చేసిన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ తర్వాత మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కామెడీ ఎంటర్‌టైనర్ గా రూపొందిన ఈ చిత్రం, ప్రదీప్‌కి ఆయన కోరుకున్న స్టార్‌డమ్‌ను తెస్తుందేమో చూడాలి.

One thought on “పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్‌పై ప్రదీప్ స్పష్టీకరణ”
Comments are closed.