మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ – ఉగాది స్పెషల్ గ్లింప్స్ విడుదల

Ram Charan Peddi Movie

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం ‘పెద్ది’పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి లీక్స్, అప్డేట్లతో ఆసక్తిని పెంచింది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, కొన్ని నెగటివ్ కామెంట్లు కూడా ఎదుర్కొన్నది. చరణ్ లుక్ ‘పుష్ప’లో అల్లు అర్జున్ లుక్‌ను గుర్తు చేస్తోందని, బాడీ లాంగ్వేజ్, స్టైల్, సిగరెట్ హోల్డ్ వంటి అంశాల్లో పోలికలున్నాయని కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.

ఈ నేపథ్యంలో, ఫస్ట్ లుక్‌పై ఏర్పడిన నెగటివ్ బజ్‌ను అదుపు చేయడానికి చిత్రబృందం త్వరలోనే గ్లింప్స్ విడుదల చేయాలని నిర్ణయించింది. చరణ్ పుట్టినరోజునే గ్లింప్స్ విడుదల చేయాలని ముందుగా భావించినప్పటికీ, ఏఆర్ రెహమాన్ అందించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆలస్యంతో ప్రణాళికలు మారాయి. దర్శకుడు బుచ్చిబాబు రెహమాన్‌ను ఫోర్స్ చేసి నాలుగు రోజుల్లో మ్యూజిక్ కంప్లీట్ చేయించారని సమాచారం. ఉగాది కానుకగా మార్చి 31న ‘పెద్ది గ్లింప్స్’ విడుదల కాబోతోంది.

కేవలం 20 సెకన్ల నిడివితో ఉన్న ఈ గ్లింప్స్ మాస్ అప్పీల్, పవర్ఫుల్ మ్యూజిక్ కలబోతగా ఉంటుందని టీమ్ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ గ్లింప్స్ సినిమా మీద ఉన్న నెగటివిటీని పూర్తిగా తొలగించి, హైప్ మరింత పెంచుతుందని చెబుతున్నారు.

గ్రామీణ నేపథ్యంతో రఫ్ అండ్ రా క్యారెక్టర్‌లో రామ్ చరణ్ నటిస్తున్నట్లు సమాచారం. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, క్రికెట్ బ్యాక్‌డ్రాప్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2025 సమ్మర్‌లో విడుదల కానుంది. ఉగాది రోజు విడుదల కానున్న గ్లింప్స్ భారీ అంచనాలను మరింత పెంచి, ‘పెద్ది’ సినిమాపై పాజిటివ్ బజ్ తెస్తుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది.

Read More

One thought on “మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ – ఉగాది స్పెషల్ గ్లింప్స్ విడుదల

Comments are closed.