ఎన్టీఆర్ సూపర్ స్టైలిష్ లుక్: జపాన్‌లో ‘దేవర’ ప్రొమోషన్లతో సందడి

NTR stylish look Japan Devara promotions

టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకటిగా పేరొందిన “మ్యాన్ ఆఫ్ మాసెస్” ఎన్టీఆర్ ప్రస్తుత కాలంలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల, హృతిక్ రోషన్‌తో బాలీవుడ్ సినిమా “వార్ 2” కోసం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో షూటింగ్ చేసిన ఎన్టీఆర్, హైదరాబాద్, ముంబై మధ్య తిరుగుతున్నారు. ప్రస్తుతం, ఆయన “దేవర” సినిమా ప్రొమోషన్ల కోసం జపాన్ వెళ్లి అక్కడ సందడి చేస్తున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన “దేవర” సినిమా ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు, ఈ సినిమా జపాన్‌లో విడుదల కోసం సిద్ధమవుతోంది.

మార్చి 28న జపాన్‌లో “దేవర” విడుదల కానుంది. ప్రొమోషన్లలో భాగంగా, ఎన్టీఆర్ అక్కడి ఫ్యాన్స్‌తో ఫోటోలు దిగుతూ, థియేటర్లలో “దేవర” సినిమా నుండి “ఆయుధ పూజ” పాటకు స్టెప్పులు వేస్తూ సందడి చేస్తున్నారు.

ఈ ప్ర‌మోష‌న్లలో, ఎన్టీఆర్ తన స్టైలిష్ లుక్‌తో మరింత ఆకట్టుకున్నారు. బ్లాక్ అండ్ బ్లాక్ షర్ట్, ప్యాంట్, డిజైనర్ హుడీ, లెదర్ షూస్, స్టైలిష్ కళ్లద్దాలు వేసుకుని తారక్ అద్భుతంగా కనిపించారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, తన కొత్త లుక్‌లో తారక్ కొంచెం సన్నబడినట్లుగా కనిపిస్తున్నారు. ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాకు సంబంధించిన మేకోవర్‌ను చూసి, అభిమానులు “తారక్ కొత్త లుక్” గురించి వివిధ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Read More