పెయిడ్ ట్రోలింగ్‌పై స్పందించిన పూజా హెగ్డే!

Pooja Hegde

ప్రముఖ నటి పూజా హెగ్డే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలో పెరుగుతున్న ట్రోలింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా, పెద్ద హీరోల సినిమాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుందని అందరికీ తెలుసు. కానీ, ఇది కేవలం హీరోలకే పరిమితం కాదని, హీరోయిన్స్ కూడా దీనికి గురవుతున్నారని పూజా హెగ్డే చెప్పారు.

సినీ పరిశ్రమలో హీరోల హవా ఎక్కువగా కనిపించినా, కథానాయికలు కూడా సినిమాలకు మంచి క్రేజ్ తెచ్చిపెడతారు. కానీ, హీరోల కోసం ప్రత్యేక కథలు రాసినా, హీరోయిన్స్‌కు మాత్రం తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో, పరిశ్రమలో కథానాయికల సంఖ్య తగ్గిపోడంతో పోటీ మరింత పెరుగుతోంది.

ఈ పోటీ వల్ల, కొంతమందిపై కావాలని ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో అవమానకరమైన కామెంట్లు, మీమ్స్ పెడుతున్నారు. బాలీవుడ్‌లో ఇది సాధారణమైపోయింది, ఇప్పుడు దక్షిణాదిలో కూడా విస్తరిస్తోంది.

పెయిడ్ ట్రోలింగ్ వెనుక పీఆర్ ఏజెన్సీలు ఉండే అవకాశం ఉందని, ఇవే హీరోయిన్స్‌పై నెగటివ్ క్యాంపెయిన్‌లు నిర్వహిస్తున్నాయని వార్తలు ఉన్నాయి. చాలా కథానాయికలు ఈ అన్యాయాన్ని గమనిస్తున్నా, బహిరంగంగా మాట్లాడేందుకు మాత్రం సందేహిస్తున్నారు.

కానీ, పూజా హెగ్డే మాత్రం ఈ సమస్యపై ఓపెన్‌గా మాట్లాడారు. దీంతో ఈ అంశంపై మరింత చర్చ జరగాలని సినీ పరిశ్రమలోని పలువురు భావిస్తున్నారు. మహిళా హీరోయిన్లు పై జరుగుతున్న అన్యాయం, పెరుగుతున్న ట్రోలింగ్‌ల గురించి విస్తృతంగా చర్చ జరిగి, దీనికి పరిష్కారం దొరకాలని ప్రేక్షకులు, ఫిల్మ్ ఫ్రటర్నిటీ కోరుకుంటున్నారు.

Read More



One thought on “పెయిడ్ ట్రోలింగ్‌పై స్పందించిన పూజా హెగ్డే!

Comments are closed.