భారత క్రికెటర్ యుజ్వేంద్ర చహల్, డాన్సర్ ధనశ్రీ వర్మకు బాంద్రా కుటుంబ కోర్టు గురువారం పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేసింది. దాదాపు రెండున్నరేళ్ల చట్టపరమైన ప్రక్రియ తర్వాత ఈ తీర్పు వెలువడింది. ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందుగా చహల్ అందుబాటులో లేకపోవడంతో, బాంబే హైకోర్టు గురువారంలోగా నిర్ణయం వెల్లడించాలని బాంద్రా కోర్టును ఆదేశించింది.
చహల్, ధనశ్రీ విడాకుల పిటిషన్లో కొన్ని ఆసక్తికరమైన, విరుద్ధమైన అంశాలు బయటకొచ్చాయి. పిటిషన్ ప్రకారం, 2020 డిసెంబర్ 23న వివాహం జరిగిన ఈ జంట 2022 జూన్‌లో విడిపోయింది. అయితే, ధనశ్రీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో “నా స్పిన్నింగ్ స్టార్‌తో 730 రోజులు” అంటూ చహల్‌తో ఫోటో షేర్ చేయడం, వారి పిటిషన్లో పేర్కొన్న తేదీలకు వ్యతిరేకంగా ఉంది. అలాగే, కోర్టు తీర్పు మేరకు చహల్ రూ. 4.75 కోట్లు ఆలిమనీగా ధనశ్రీకి చెల్లించాల్సి ఉంటుంది.
హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం, విడాకుల పిటిషన్ దాఖలు చేసిన ప్రతి జంటకు 6 నెలల కూలింగ్ పీరియడ్ తప్పనిసరి. అయితే, పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతున్న తమ కేసులో ఈ గడువు మినహాయించాలని చహల్, ధనశ్రీ అభ్యర్థించగా, బాంబే హైకోర్టు బుధవారం ఈ నిబంధనను రద్దు చేసింది.
చహల్ కోర్టుకు హాజరైనప్పుడు ఆయన వేసుకున్న “బీ యువర్ ఓన్ షుగర్ డాడీ” అనే వాక్యం ఉన్న టీషర్ట్ నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. నెటిజన్లు దీన్ని ధనశ్రీకు ఉద్దేశించిన పరోక్ష సందేశంగా భావిస్తున్నారు. మరోవైపు, కోర్టు తీర్పుకు ముందుగా ధనశ్రీ అబ్యూసివ్ మ్యారేజ్లపై ఓ ప్రత్యేక పాట విడుదల చేయడం కూడా చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో, చహల్ ఆర్జే మహవాష్‌తో, ధనశ్రీ కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్‌తో సంబంధం కొనసాగిస్తున్నారనే వార్తలు గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

One thought on “చహల్ – ధనశ్రీ విడాకుల వెనుక షాకింగ్ నిజాలు!”
Comments are closed.