బెంగళూరు వయ్యాలికావల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భర్త తన భార్య వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శ్రీకాంత్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి 2022లో ఓ యువతితో వివాహం చేసుకున్నాడు. అయితే, పెళ్లి తర్వాత భార్య తరచుగా అతన్ని వేధిస్తోందని శ్రీకాంత్ ఆరోపించాడు.
శ్రీకాంత్ ఫిర్యాదు ప్రకారం, భార్య తనను రోజుకు రూ.5000 ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. లేకపోతే రూ.45 లక్షలు ఇచ్చి విడాకులు తీసుకోవాలని బెదిరిస్తోందని పేర్కొన్నాడు. అంతేకాకుండా, జూమ్ ద్వారా విధులు నిర్వహిస్తున్న సమయంలో అకారణంగా మధ్యలో వచ్చి డ్యాన్స్‌లు చేస్తూ తిట్టుతోందని, ఆమెకు ఎదురు మాట్లాడితే చనిపోతానంటూ బెదిరిస్తోందని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు.
శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

2 thoughts on “బెంగళూరు: భర్తకు వేధింపులు – రోజు రూ.5000 ఇవ్వాలని భార్య డిమాండ్”
Comments are closed.