‘L2E: Empuraan’ ట్రైలర్: మళయాళ సినీ రంగంలో ‘లూసిఫర్’ పవర్ రీ-ఎంట్రీ!

L2 Empuraan

మలయాళ చిత్రపరిశ్రమలో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘లూసిఫర్’ ఒకటి. ఈ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ‘L2E: Empuraan’ త్వరలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ రోజు విడుదలైన ట్రైలర్ ఆకర్షణీయంగా, స్టైలిష్‌గా, యాక్షన్‌ సన్నివేశాలతో దుమ్ముదులిపింది. మోహన్‌లాల్ సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో, అవన్నీ ఈ ట్రైలర్‌లో మెరిసిపోతున్నాయి.

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, మొదటి భాగం ముగిసిన నుంచే ప్రారంభమవుతుంది. తోవినో థామస్ రాజకీయ పార్టీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎదురయ్యే సవాళ్లతో కథ ముందుకు సాగుతుంది. అయోమయం తారాస్థాయికి చేరిన ఈ పరిస్థితిలో, అందరి దృష్టి ఖురేషీ అబ్రాం/స్టీఫెన్ నెడుంబల్లిపై పడుతుంది.

ఈ కథ కేవలం కేరళ రాజకీయాలకే పరిమితం కాకుండా, దేశ-విదేశాలకు విస్తరించి సాగుతుంది. పొలిటికల్ డ్రామా మరియు భారీ యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువ స్కోప్ ఉంది. పృథ్వీరాజ్ సుకుమారన్, కొంతమంది ప్రేక్షకులకు కొత్త దర్శకుడిగా అనిపించినా, ఈ ట్రైలర్ చూస్తే ఆయన పనితనం స్పష్టంగా అర్థమవుతుంది.

ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, ఆషిర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘L2 Empuraan’ మార్చి 27, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది!

Read More

One thought on “‘L2E: Empuraan’ ట్రైలర్: మళయాళ సినీ రంగంలో ‘లూసిఫర్’ పవర్ రీ-ఎంట్రీ!

Comments are closed.