యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ అనే భారీ బడ్జెట్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌తో రూపొందుతోంది. గతేడాది నుంచి షూటింగ్ జరుగుతున్నప్పటికీ, ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో సినిమా క్యాన్సిల్ అయ్యిందని పుకార్లు వచ్చాయి.
తాజాగా నిఖిల్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించారు. ప్రస్తుతం స్వయంభూ షూటింగ్ చివరి దశలో ఉందని, ఇప్పటివరకు 95% షూటింగ్ పూర్తయిందని చెప్పారు. సినిమా చాలా రహస్యంగా షూటింగ్ చేస్తున్నామని, కానీ అందుకు గల కారణం చెప్పలేనని తెలిపారు.
ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్‌కి ఎక్కువ సమయం పడుతుందని, అందుకే షూటింగ్ పూర్తయినా విడుదలకు కొంత ఆలస్యం అవుతుందని నిఖిల్ పేర్కొన్నారు. అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రేక్షకులకు వినూత్న అనుభూతి ఇస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
ఇక స్వయంభూతో పాటు నిఖిల్ మరో ప్రాజెక్ట్ ది ఇండియా హౌస్ కూడా మొదలుపెట్టారు. ఈ సినిమాకు సంబంధించి గుర్రపు స్వారీ, మార్షల్ ఆర్ట్స్ వంటి యుద్ధ కళలను ఆయన నేర్చుకుంటున్నారు. ఈ రెండు సినిమాలు తన కెరీర్లో కీలకంగా మారనున్నాయని నిఖిల్ వెల్లడించారు.

One thought on “నిఖిల్ ‘స్వయంభూ’ పై క్లారిటీ – రహస్యంగా షూటింగ్ ఎందుకు?”
Comments are closed.