రమణ గోగుల సింగింగ్ రీ-ఎంట్రీ.. అనిల్ రావిపూడి మ్యాజిక్!

ramana-gogula-to-sing-for-megastar-chiranjeevi

సంగీత ప్రపంచంలో రమణ గోగుల పేరు ఒక ఊపు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ అమెరికాలో సెటిలయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రమణ గోగుల మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. గోదారి గట్టు మీద పాటకు మంచి రెస్పాన్స్ రావడంతో మరోసారి ఆయనపై మ్యూజిక్ డైరెక్టర్ల దృష్టి పడింది.

ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో రమణ గోగుల ఓ పాట పాడనున్నాడనే వార్త ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అవుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎన్నో హిట్ పాటలు అందించిన రమణ గోగుల, చిరంజీవి సినిమాకు పాట పాడితే అది ఎంత భారీ స్థాయిలో వైరల్ అవుతుందో చూడాలి.

ప్రస్తుతం అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది చివరిలో సినిమాను పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రమణ గోగుల పాట నిజమైతే, ఈ చిత్రం సంగీత పరంగా మరో హైలైట్ కానుందని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Read More

One thought on “రమణ గోగుల సింగింగ్ రీ-ఎంట్రీ.. అనిల్ రావిపూడి మ్యాజిక్!

Comments are closed.