ప్రత్యేకమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘టెస్ట్’ సినిమా, నయనతార ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాతో శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘టెస్ట్’ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిందీ, ఇది నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ఏప్రిల్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.
ఈ నేపథ్యంలో , ‘టెస్ట్’ సినిమాలో నయనతార పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఈ టీజర్‌ను ప్రేక్షకులు మంచి రెస్పాన్స్‌తో స్వీకరించారు.
ఈ సినిమా షూటింగ్ 2024లోనే పూర్తయినా, కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యం అయింది. అందుకే, చిత్రయూనిట్ ఓటీటీలోనే నేరుగా విడుదల చేయాలని నిర్ణయించింది.
ఈ చిత్రంలో మాధవన్, సిద్ధార్థ్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, మీరా జాస్మిన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘టెస్ట్’ సినిమాకు ఫ్యామిలీ మ్యాన్ రచయిత సుమన్ కుమార్ కథ అందించారు. శక్తి శ్రీ గోపాలన్ సంగీతం అందించారు.

One thought on “‘టెస్ట్’ సినిమా నుంచి నయనతార స్పెషల్ వీడియో విడుదల”
Comments are closed.