ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా నటించిన డివోషనల్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’ మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘శాసనసభ’ ఫేమ్ షణ్ముగం సాప్పని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమైంది.
ఈ సినిమా కోసం ఆది సాయికుమార్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. రవి బసూర్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ ప్రాజెక్ట్‌కి ‘శాసనసభ’ తర్వాత సాప్పని బ్రదర్స్ నిర్మించిన రెండో చిత్రం కావడం విశేషం.
చిత్రం రిలీజ్‌కు ముందే డిజిటల్ హక్కులు, శాటిలైట్ రైట్స్, ఇతర భాషల థియేట్రికల్ హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయి. ఏపీ, తెలంగాణలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
నిర్మాత షణ్ముగం సాప్పని మాట్లాడుతూ, “‘షణ్ముఖ’ అద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదలైన ‘చంద్రకళ’ పాటకు చక్కటి స్పందన వచ్చింది.”
ఈ కార్యక్రమంలో కథానాయిక అవికా గోర్, ప్రతినాయక పాత్రధారి చిరాగ్ తదితరులు పాల్గొన్నారు.

One thought on “ఆది సాయికుమార్ ‘షణ్ముఖ’ విడుదలకు సిద్ధం!”
Comments are closed.