మెగాస్టార్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న ఇషా చావ్లా!

మెగాస్టార్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న ఇషా చావ్లా!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘వాల్తేరు వీరయ్య’తో భారీ హిట్ అందుకున్న ఆయన, ‘భోళా శంకర్’తో నిరాశపరిచారు. ఇప్పుడు ‘విశ్వంభర’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సోషియో-ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తుండగా, మరో హీరోయిన్‌గా ఆషికా రంగనాథ్ కనిపించనున్నారు. అయితే ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది.

ఆమె ఎవరో కాదు.. ‘ప్రేమ కావాలి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఇషా చావ్లా. ఆదిసాయికుమార్ హీరోగా నటించిన ఈ చిత్రంతో హీరోయిన్‌గా మారిన ఆమె, తన అందంతో పాటు అభినయంతో కూడా ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నా, అనుకున్న స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేకపోయింది.

తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా, అవకాశాల పరంగా వెనుకబడటంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఇప్పుడు చిరంజీవి సినిమాలో అవకాశం దక్కించుకోవడంతో మళ్లీ వెండితెరపై మెరిపించేందుకు సిద్ధమవుతోంది.

అయితే, ఇప్పుడు చిరు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం ఆమె కెరీర్‌కు మళ్లీ కొత్త ఊపునిస్తుందేమో చూడాలి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Read More

One thought on “మెగాస్టార్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న ఇషా చావ్లా!

Comments are closed.