15 రోజుల్లో 150 మందిని బలితీసుకున్న భయంకరమైన బ్లీడింగ్ ఐ వైరస్!

ఆఫ్రికాలో హాహాకారమంటిస్తున్న బ్లీడింగ్ ఐ వైరస్: 15 రోజుల్లో 150 మంది మృతి

ప్రపంచం మరోసారి మహమ్మారి ముప్పుకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికాలో ఉద్భవించిన బ్లీడింగ్ ఐ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అక్కడి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కేవలం 15 రోజుల్లోనే 150 మందికి పైగా మృత్యువాత పడటంతో ఆ దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు.

కాంగోలో వ్యాధి ఉధృతి
డిసెంబర్ 6: కాంగోలోని క్వాంగో ప్రావిన్స్‌లో ఈ వైరస్ ప్రథమంగా గుర్తించబడింది. నవంబర్ 10 నుంచి నవంబర్ 25 వరకు పాంజీ హెల్త్ జోన్‌లో 150 మరణాలు సంభవించాయి. ఈ వ్యాధి లక్షణాలు ఫ్లూని పోలి ఉంటాయని, రోగుల్లో అధిక జ్వరం, తలనొప్పి, దగ్గు, రక్తహీనత వంటి సమస్యలు కనిపిస్తున్నాయని ఆరోగ్య అధికారులు తెలిపారు.

వైద్య సహాయం అందుబాటులో లేదు
వైరస్ తీవ్రత వల్ల రోగులు తమ ఇళ్లలోనే చనిపోతున్నారు. మరణాల కారణాలు తెలుసుకునేందుకు ప్రత్యేక వైద్య బృందం నమూనాలు సేకరించి పరిశోధన ప్రారంభించింది. అయితే, ఈ వ్యాధి నివారణకు ప్రత్యేక చికిత్స ఇంకా అందుబాటులో లేదు.

ప్రజలను హెచ్చరిస్తున్న అధికారులు
ఆంటువ్యాధి ముప్పు కారణంగా ప్రజలు మృతదేహాలకు దగ్గరగా వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వైరస్ మరింత విస్తరించకుండా అడ్డుకోవటానికి ఆ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

మహిళలు, పిల్లలపై తీవ్ర ప్రభావం
ఎపిడెమియాలజీ నివేదికల ప్రకారం, ఈ వైరస్ ఎక్కువగా మహిళలు, పిల్లలపై ప్రభావం చూపుతోంది. నవంబర్ 25న ఒక్క రోజులోనే 67 మరణాలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.

ప్రపంచ ఆందోళన
కోవిడ్-19 తర్వాత మరోసారి ప్రపంచం మహమ్మారి ముప్పుకు గురవుతుందా అనే ఆందోళన నెలకొంది. కాంగోలో ఈ వైరస్‌ను త్వరగా అడ్డుకోవడానికి అనేక దేశాలు సహాయం అందించాల్సిన అవసరం ఉంది.