హైదరాబాద్: ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు, కార్యాలయానికి తరలింపు

ప్రముఖ నిర్మాత మరియు తెలంగాణ ఎఫ్ఎసీ చైర్మన్ దిల్ రాజు నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తనిఖీలలో భాగంగా, దిల్ రాజును ఆయన నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ (ఎస్వీసీ) కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆయన నివాసంలో పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అనంతరం, ఐటీ అధికారులు దిల్ రాజును సాగర్ సొసైటీ లోని కార్యాలయానికి తమ వాహనంలో తీసుకెళ్లారు. ఎస్వీసీ కార్యాలయంలో కూడా ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

Vist Our Youtube Channel Click Here