స్మార్ట్‌ఫోన్ ప్రియులకు అదిరే ఆఫర్: iQOO 13 ఫీచర్లు, ధర, ఆఫర్లు

iQOO 13 |
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఐకూ (iQOO) తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ iQOO 13 ను భారత మార్కెట్లో విడుదల చేసింది. iQOO 12కు కొనసాగింపుగా వచ్చిన ఈ ఫోన్, క్వాల్కామ్ సరికొత్త ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఆకట్టుకునే ఫీచర్లతో వస్తోంది. ప్రత్యేకంగా గేమింగ్ ప్రియుల కోసం రూపొందించిన ఈ ఫోన్‌పై ధరలు, ఇతర వివరాలు తెలుసుకుందాం.

ధర & వేరియంట్లు:
iQOO 13 రెండు వేరియంట్లలో లభిస్తుంది:

  • 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్: రూ.54,999
  • 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్: రూ.59,999

ఈ ఫోన్ లెజెండ్, నార్డో గ్రే రంగులలో అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 11 నుంచి అమెజాన్ మరియు iQOO ఈ-స్టోర్‌లో విక్రయాలు ప్రారంభమవుతాయి.

ఆఫర్లు:

  • HDFC, ICICI క్రెడిట్/డెబిట్ కార్డు హోల్డర్లు రూ.3,000 డిస్కౌంట్ పొందవచ్చు.
  • వివో లేదా iQOO పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్‌ చేస్తే అదనంగా రూ.5,000 వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

గేమింగ్, స్మార్ట్‌ఫోన్ ప్రదర్శనలో ఉత్తమ అనుభవం కోసం ఐకూ 13 మిమ్మల్ని నిరాశపరచదు.