బెంగళూరు గోదాములో భారీ దొంగతనం

thieves

830 కిలోల మానవ ముడి జుట్టు అపహరణ

నగరంలోని ఓ గోదాములో భారీ చోరీ జరిగింది. దుండగులు సుమారు ₹1 కోటి విలువైన 830 కిలోల మానవ ముడి జుట్టును దోచుకెళ్లారు. మొత్తం ఆరుగురు సభ్యులుగల దొంగల ముఠా ఈ దొంగతనానికి పాల్పడింది.

పోలీస్ వివరాల ప్రకారం, దొంగలు రాత్రివేళ గోదాములోకి చొరబడి అక్కడ నిల్వ ఉన్న 27 బ్యాగుల జుట్టును కారులో లోడ్ చేసి పరారయ్యారు. ఈ ఘటనపై సంబంధిత వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దొంగతనానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ దృశ్యాల్లో అనుమానాస్పదంగా కనిపిస్తున్న వ్యక్తుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. గోదాములో పనిచేసే వారు, పరిసర ప్రాంతాల్లోని వ్యక్తుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఈ చోరీ వెనుక ముఠా వ్యవహారం ఉందా? ముందుగా ప్రణాళికబద్ధంగా జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More