ఇప్పటి వరకు కేవలం నిర్మాతల ఇళ్లలోనే సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు ఇప్పుడు ‘పుష్ప 2’ చిత్ర దర్శకుడు సుకుమార్ ఇంట్లోనూ సోదాలు చేపట్టారు. ‘పుష్ప 2’ నిర్మాణంలో సుకుమార్ కు షేర్లు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. సుకుమార్ నిర్మాణ సంస్థ ‘సుకుమార్ రైటింగ్స్’ మరియు మైత్రీ మూవీ మేకర్స్ తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, సుకుమార్ యొక్క ఇంటి మరియు కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి.
ఇటీవల, సుకుమార్ ఎయిర్‌పోర్టు నుండి ఇంటికి తీసుకువచ్చి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు, ‘గేమ్ చేంజర్’ మరియు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాల నిర్మాత దిల్ రాజు ఇల్లు, కార్యాలయాలు, మరియు బంధుమిత్రుల ఇళ్లలో రెండో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు, దిల్ రాజు కుమార్తె హన్సితారెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆమె సమక్షంలో డిజిటల్ లాకర్లు ఓపెన్ చేయించారు, మరికొద్దిసేపట్లో బ్యాంక్ లాకర్లు కూడా ఓపెన్ చేయనున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ కు చెందిన రవిశంకర్, నవీన్, సీఈఓ చెర్రీ తదితరుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సింగర్ సునీత భర్త రాముకు సంబంధించిన మ్యాంగో మీడియా సంస్థలోనూ సోదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ అగర్వాల్ మరియు ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత కిషోర్ ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి.
ఈ వార్త కూడా చదవండి

One thought on “సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు.. పుష్ప 2 నిర్మాణంలో షేర్లు!”
Comments are closed.