అమెరికాలోని లాస్‌ఏంజెలెస్ నగరంలో కార్చిచ్చు చెలరేగింది. హాలీవుడ్ నటులు, ప్రముఖులు నివాసం ఉన్న పసిఫిక్ సాలేడ్స్ ప్రాంతం మంటల్లో చిక్కుకుంది. టామ్ హాంక్స్, రీస్ విథర్స్పూన్ వంటి ప్రముఖ హాలీవుడ్ నటుల ఇళ్లు కూడా అగ్నికి ఆహుతిగా మారినట్లు తెలుస్తోంది. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి, ఇకపోతే గాలులు బలంగా వీస్తున్నాయి, కాబట్టి మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం కార్చిచ్చు 3వేల ఎకరాలను వ్యాప్తి చేసుకుంది.
250 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. సుమారు 30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, అధికారులు 100,000 మందిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి రావచ్చని అంచనా వేస్తున్నారు. లాస్‌ఏంజెలెస్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మంటలు 13,000 భవనాలకు ముప్పు పొంచి ఉన్నాయని ఫైర్ చీఫ్ క్రిస్టిన్ క్రౌలీ తెలిపారు.
అలాగే, పాలిసేడ్స్ నుండి బయటపడటానికి ఒక్క రోడ్డు మార్గమే ఉండటం కారణంగా, వందల సంఖ్యలో ప్రజలు కార్లలో తరలిపోతుండగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో, వారు కార్లను అక్కడే వదిలేసి పారిపోయారు.
