బీజేపీ కూటమిలో చేరే ప్రసక్తే లేదు: డి.జయకుమార్‌

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమిలో చేరే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీ మంత్రి డి.జయకుమార్‌(Former Minister D. Jayakumar) మరోమారు తేల్చిచెప్పారు.

మాజీ మంత్రి: బీజేపీ కూటమిలో చేరే ప్రసక్తే లేదు..

  • అన్నాడీఎంకే మాజీ మంత్రి డి.జయకుమార్‌

చెన్నై: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమిలో చేరే ప్రసక్తే లేదని అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీ మంత్రి డి.జయకుమార్‌(Former Minister D. Jayakumar) మరోమారు స్పష్టం చేశారు. స్థానిక రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో శుక్రవారం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ 108వ జయంతి వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అన్నాడీఎంకే(AIADMK) ప్రభుత్వం ప్రజలకు పలు ప్రభుత్వ పథకాలను అందించి, కష్టాల్లో ఉన్న వారికి ఆర్థిక సాయం చేయడంలో ఎంజీఆర్‌ చరిత్రలో ధర్మప్రభువుగా నిలిచిపోతారని చెప్పారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ఈ పొంగల్‌ సందర్భంగా ప్రజలకు మొండి చెయ్యి చూపించారని జయకుమార్‌ వ్యాఖ్యానించారు.

ఈరోడ్‌ ఈస్ట్‌ నియోజకవర్గ ఉపఎన్నిక పారదర్శకంగా జరగలేనందునే అన్నాడీఎంకే బహిష్కరించిందని, డీఎంకే చెబుతున్నట్లుగా ఓటమి భయంతో కాదు, మతవాదాన్ని రెచ్చగొడుతున్న బీజేపీతో ఎట్టి పరిస్థితిలోనూ అన్నాడీఎంకే చేతులు కలపదని జయకుమార్‌ పేర్కొన్నారు. బీజేపీ నేతలు పొత్తుల గురించి చెబుతున్నవన్నీ అబద్ధాలేనని ఆయన స్పష్టం చేశారు.

ఈవార్తను కూడా చదవండి