బిగ్ బ్రేకింగ్: కేటీఆర్‌పై కేసు పెట్టేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..
ఫార్ములా ఈ-కార్ రేసు: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం
హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణ రాజకీయాల్లో మరో ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న ఈ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత, ఈ కేసు మరింత వేగంగా ముందుకు సాగనుంది.
ఫార్ములా ఈ-కార్ రేసులో భారీ అవినీతికి పాల్పడినట్లు ప్రభుత్వానికి నిర్ధారణైంది. ఈ కేసులో నిధులు ఒప్పందానికి ముందు చెల్లించడంపై ఆరోపణలు ఉన్నాయి. HMDA, RBI అనుమతి లేకుండా రూ. 46 కోట్లు బదిలీ చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అప్పటి చీఫ్ ఇంజనీర్, మరియు కేటీఆర్‌పై కేసు నమోదు చేయాలని ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది.
ఇప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్‌పై కేసు నమోదు చేయాలనుకునే అనుమతి కోసం గవర్నర్‌కు లేఖ రాశింది. ఈ లేఖను పరిశీలించిన గవర్నర్, న్యాయ సలహా తీసుకున్న తర్వాత అనుమతిని ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గవర్నర్ ఆమోదంతో, ఫార్ములా ఈ-కార్ రేసు కేసు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
