జామకాయ | రోజుకు ఒక జామకాయ తింటే శరీరంలో కలిగే అద్భుత మార్పులు ఇవే..!
జామకాయ అంటే చాలా మందికి ఎంతో ఇష్టమైన పండు. ప్రస్తుతం జామకాయలు మనకు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటున్నాయి. అయితే సీజనల్‌గా లభించే స్థానిక జామకాయలను తింటేనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు పొందగలుగుతాం. జామకాయలు తక్కువ క్యాలరీలు, అధిక పోషకాలు కలిగి ఉంటాయి. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రోజూ కనీసం ఒక జామకాయను తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
విటమిన్ సి అధికం
జామకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఒక మిడిమి సైజు జామకాయ తింటే సుమారు 228 మిల్లీగ్రాముల విటమిన్ సి అందుతుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. దగ్గు, జలుబు, ఫ్లూ వంటి చిన్న ఇన్‌ఫెక్షన్లను అరికట్టడంలో ఇది సహాయపడుతుంది. అలాగే జామకాయల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
డయాబెటిస్ నియంత్రణ
డయాబెటిస్ ఉన్నవారికి జామకాయలు చాలా మంచివి. వీటిలో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో, రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే వీటిలో ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది.
జీర్ణక్రియ మెరుగుదలకు
జామకాయలో ఉన్న ఫైబర్ మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. జామ ఆకులతో చేసిన కషాయం తాగడం వల్ల విరేచన సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాగే ఇందులో మెగ్నీషియం సమృద్ధిగా ఉండటంతో కండరాలను ప్రశాంతం చేస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
మెదడుకు పోషణ
జామకాయలో విటమిన్ బి6 (పైరిడాక్సిన్) మరియు బి3 (నియాసిన్) సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడుకు ఆహారంగా పనిచేస్తూ జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి.
ఇతర ప్రయోజనాలు
- థైరాయిడ్ సమస్యలను నియంత్రిస్తుంది.
- రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
- గుండె పటిష్టంగా ఉంటుంది.
- నిద్రలేమి సమస్య తగ్గుతుంది.
రోజూ ఒక జామకాయను ఆహారంలో చేర్చడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి ఈ సహజ ఔషధ పండును మీ డైట్‌లో భాగం చేసుకోండి!
