చిత్తూరు జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. “కమ్మని విందుల కనుమ పండుగ మీ కుటుంబాల్లో సంతోషాన్ని నింపాలి. వ్యవసాయదారుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకొన్న పశు సంపదను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని కనుమ పండుగ మనకు గుర్తు చేస్తుంది. కాలం మారినా తరగని అనుబంధాల సంపద మనది. ఆ విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. మీ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు” అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
ఈ పండుగ ప్రత్యేకతలు
కనుమ పండుగను తెలుగు ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటారు. పశు సంపద పూజతో వ్యవసాయంపై మనకున్న గౌరవాన్ని, అనుబంధాన్ని ఈ పండుగ వ్యక్తం చేస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
