అల్లు అర్జున్: పాన్ ఇండియా హిట్ తర్వాత మాస్టర్ ప్లాన్.. ఇక ఆపేవాడే లేడు’పుష్ప 2′ హ్యుజ్ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ లైనప్‌పై అందరి దృష్టి పడింది. ఒక సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సాధించిన తర్వాత భవిష్యత్తు ప్రాజెక్టులను జాగ్రత్తగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో బన్నీ పూర్తి స్థాయి సక్సెస్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులు అనుకున్న విధంగా వర్కౌట్ అయితే, ఇండియన్ సినిమా రంగంలో అగ్రస్థానాన్ని అల్లు అర్జున్ సొంతం చేసుకోవడం ఖాయం.త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ప్రాజెక్ట్’పుష్ప 2′ తర్వాత బన్నీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది త్రివిక్రమ్ తొలి పాన్ ఇండియా చిత్రం కావడంతో, హిస్టారికల్ ఎలిమెంట్స్‌తో మైథలాజికల్ టచ్‌ని కలిపి సినిమాను తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో సినిమా ఏప్రిల్‌లో షూటింగ్ మొదలుకానుంది.సంజయ్ లీల భన్సాలీతో జట్టుఅలాగే, బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీల భన్సాలీతో కూడా బన్నీ ఓ ప్రాజెక్ట్‌కి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. భన్సాలీ తన గ్రాండ్ స్కేల్ సినిమాలతో ప్రాచుర్యం పొందిన దర్శకుడు. అలాంటి గొప్ప దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా చేయడం అంటే ఇండస్ట్రీలే భయపడే స్థాయికి వెళ్లే అవకాశముంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలుబడనున్నాయి.సందీప్ రెడ్డి వంగాతో ప్రాజెక్ట్ఇతర ప్రాజెక్టుల క్రమంలో బన్నీ సందీప్ రెడ్డి వంగాతో ఓ చిత్రాన్ని చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా భారీ అంచనాలు తెచ్చుకుంటోంది.ఈ లెక్కన, అల్లు అర్జున్ సినిమాలన్నీ సక్సెస్ సాధిస్తే, ఇండియన్ సినిమా రంగంలో బన్నీ అనే పేరు మార్మోగటం ఖాయం.
Share This
