ట్రంప్ : ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’ వ్యాఖ్యలపై.. ట్రంప్‌కు మెక్సికన్ అధ్యక్షురాలి కౌంటర్..
‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మార్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ ఘాటుగా స్పందించారు.
అగ్రరాజ్య అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, తన బాధ్యతలు చేపట్టక ముందే భూవిస్తరణ కాంక్షతో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 20న ప్రమాణస్వీకారం చేయనున్న ట్రంప్, అధికారంలోకి రాగానే పొరుగుదేశం కెనడాను 51వ రాష్ట్రంగా పేర్కొంటూ ఆ దేశంపై అమెరికా జెండా ఎగురుతున్న మ్యాప్‌ల ఫొటోలను విడుదల చేశారు. అలాగే, డెన్మార్క్‌కి చెందిన స్వయం ప్రతిపత్తి దేశాలు అయిన గ్రీన్‌ల్యాండ్, పనామా కాలువలను విలీనం చేసుకుంటామని ప్రకటించారు.
‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మార్చే సంచలన వ్యాఖ్యలు చేయడంతో మెక్సికో, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. తాజాగా, ట్రంప్ వ్యాఖ్యలపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ స్పందించారు. ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా’ అనే బదులు ‘మెక్సికన్ అమెరికా’ అని మేము పిలిస్తే తప్పేమీ లేదని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
అదే సమయంలో, ట్రంప్ మెక్సికోను హెచ్చరించారు. అక్రమ వలసలు, మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకోకపోతే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలిపారు. అధికారంలోకి రాగానే ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మార్చే వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై, మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ ధీటుగా స్పందించారు. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 17వ శతాబ్దంలో ఉత్తర అమెరికాను ‘మెక్సికన్ అమెరికా’ అని పిలిచేవారని గుర్తుచేసారు. ఈ పేరుతో ఇప్పుడు పిలిస్తే చాలా బాగుంటుందని ఆమె వ్యాఖ్యానించారు.
అలాగే, ఐక్యరాజ్యసమితి కూడా ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ పేరును ఎప్పుడో గుర్తించిందని, ట్రంప్ దీనిని గుర్తించమని సూచించారు. మెక్సికో, అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినకుండా ఉండాలని ఆమె ఆకాంక్షించారు.
ఇప్పుడు, ట్రంప్ ఈ మధ్య తరచూ రాజ్య విస్తరణ కాంక్షను వ్యక్తం చేస్తూ, డెన్మార్క్, గ్రీన్‌ల్యాండ్, పనామా కాలువలను విలీనం చేసుకోవాలని ప్రకటించారు. ఐరోపా సమాఖ్య ఇప్పటికే ఈ ప్రకటనపై వార్నింగ్ ఇచ్చింది. అంతర్జాతీయంగా పలువురు రాజకీయ విశ్లేషకులు ఈ విధానంపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
