ప్రభాస్ పెళ్లి: రామ్ చరణ్ బిగ్ రివీల్, వెస్ట్ గోదావరి అమ్మాయితో పెళ్లి!

ప్రభాస్ పెళ్లి: బాలయ్య వ్యాఖ్యలు, రామ్ చరణ్ గుడ్ న్యూస్!

ప్రభాస్ పెళ్లి:ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న ప్రభాస్ (Prabhas), ప్రస్తుతం పెళ్లి గురించి మీడియా, అభిమానుల నుంచి ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. ఆయన పెళ్లి విషయంలో అభిమానుల ఎదురు చూసే క్షణాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇటీవల, బాలకృష్ణ “అన్ స్టాపబుల్” షోలో ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది, అప్పుడు రామ్ చరణ్ ఆసక్తికరమైన సమాచారం అందించారు.

ఇటీవల, “గేమ్ చేంజర్” సినిమా ప్రమోషన్ కోసం రామ్ చరణ్ షోలో హాజరయ్యారు. బాలకృష్ణ, ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్న అడిగినప్పుడు, రామ్ చరణ్ ప్రభాస్ పెళ్లి గురించి కీలకమైన విషయాలు వెల్లడించారు. అతను తెలిపిన సమాచారం ప్రకారం, ప్రభాస్ పెళ్లి చేసుకునే అమ్మాయి వెస్ట్ గోదావరి జిల్లా గణపవరంకు చెందిన పదహారు అణాల తెలుగు అమ్మాయే అని తెలిపారు.

ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వార్త నిజమై కావాలని కోరుకుంటున్నారు. ఈ వార్తను వారు ఎంతో హర్షంతో స్వాగతిస్తున్నారు.

గతేడాది, ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు భార్య శ్యామల దేవి, విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటూ, పెళ్లి విషయంపై మీడియా ప్రశ్నలపై స్పందించారు. “పెళ్లికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ త్వరలోనే ఉంటుందని” చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రభాస్ పెళ్లి సమీపంలో ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నాయి.

ప్రస్తుతం, ప్రభాస్ “సలార్ 2”, “కల్కి 2”, “ది రాజా సాబ్”, “స్పిరిట్”, “ఫౌజి” వంటి సినిమాలతో పాటు, హోంబలే ఫిల్మ్స్‌లో కూడా మరో రెండు సినిమాలకు సైన్ చేశారు.