టాలీవుడ్: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు, ఫైట్ మాస్టర్ విజయ రంగరాజు మృతి
టాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇటీవల ఒక సినిమా షూటింగ్లో గాయపడిన ప్రముఖ నటుడు, ఫైట్ మాస్టర్ విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ మరణించారు. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, గుండెపోటుతో సోమవారం తుదిశ్వాస విడిచారు.
గత వారం హైదరాబాద్లో ఒక సినిమా షూటింగ్లో గాయపడిన ఆయన, మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించబడ్డారు. కానీ వైద్య ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
విజయ రంగరాజు ఎక్కువగా విలన్ పాత్రలతో పాటు సహాయ పాత్రల్లో నటించారు. తెలుగులో బాలకృష్ణ నటించిన భైరవ ద్వీపం సినిమాతో పరిశ్రమలోకి ప్రవేశించిన ఆయన, గోపీచంద్ నటించిన యజ్ఞం చిత్రంతో మంచి గుర్తింపు పొందారు.
తమిళం, మలయాళం చిత్రాల ద్వారా కూడా మంచి గుర్తింపు సాధించిన విజయ రంగరాజు, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్లో తన కఠోర శ్రమతో ప్రత్యేకతను చూపించారు. టాలీవుడ్ ఈ గానీ నటుడి మృతితో తీవ్ర శోకంలో మునిగిపోయింది.
ఈ వార్త కూడా చదవండి

One thought on “ఇండస్ట్రీలో విషాదం: ప్రముఖ నటుడు విజయ రంగరాజు ఇకలేరు”
Comments are closed.