Winter Skin Care Tips: చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉంచడానికి అనుసరించాల్సిన సహజ చిట్కాలు

వింటర్ స్కిన్ కేర్ టిప్స్: చర్మం పొడిబారకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

చలికాలంలో చర్మం పొడిబారడం చాలా సాధారణ సమస్య. అయితే, ఈ సమస్య మరింత తీవ్రంగా మారడానికి ఒక కారణం తప్పు మాయిశ్చరైజర్‌ను ఉపయోగించడం.

డెర్మటాలజిస్ట్ సుభ్రజ్యోతి దత్తా ప్రకారం, చర్మం పొడిబారకుండా ఉండేందుకు కెమికల్ కాస్మోటిక్స్ కాకుండా సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన మాయిశ్చరైజర్లను వాడటం మంచిది.

షియా బటర్‌లోని ఫ్యాటీ యాసిడ్‌లు మరియు విటమిన్లు చర్మాన్ని లోతుగా మాయిశ్చరైజ్ చేసి, చర్మాన్ని పొడిబారకుండా చేస్తాయి. దీనిని నేరుగా చర్మంపై అప్లై చేయవచ్చు.

కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉండటం వలన, ఇది చర్మంలో తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. స్నానం చేసిన తర్వాత తడి చర్మంపై కొబ్బరి నూనెను మసాజ్ చేయడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది.