ప్రముఖ దర్శకుడు విక్రమ్ భట్ తన హారర్ రొమాంటిక్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు, ఆయన కొత్త చిత్రం తుమ్కో మేరీ కసం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనుపమ్ ఖేర్, అదా శర్మ, ఇష్వాక్ సింగ్, ఇషా డియోల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రముఖ ఐవీఎఫ్ డాక్టర్ అజయ్ ముడియా జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది.
ఇటీవల ఫిల్మ్‌ఫేర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విక్రమ్ భట్ బాలీవుడ్‌లో అత్యంత అండర్‌రేటెడ్ నటుడు సల్మాన్ ఖాన్ అని అభిప్రాయపడ్డారు. “సల్మాన్ ఖాన్‌ను సాధారణంగా బ్లాక్‌బస్టర్ మాస్ మూవీలకు మాత్రమే పరిమితం చేస్తారు. కానీ అతనిలో గొప్ప నటనా ప్రతిభ ఉంది. నాకు అవకాశం వస్తే, ఆయనతో ఒక యాక్షన్-ఎమోషనల్ సినిమా తీయాలనుకుంటాను,” అని విక్రమ్ భట్ తెలిపారు.
అలాగే, “సల్మాన్ ఖాన్‌ను ప్రతిసారీ అదే తరహా పాత్రల్లో చూడటం వల్ల, అతని అసలైన టాలెంట్ కనిపించట్లేదు. మెల్లగా నడిచే యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్ మూమెంట్స్ ఇవే ఎక్కువగా చూపిస్తున్నారు. కానీ, అప్పుడప్పుడు సల్మాన్ ఖాన్‌లో ఉన్న నిజమైన నటుడిని నేను గమనించగలిగాను,” అని అన్నారు.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా, కాజల్ అగర్వాల్‌తో కలిసి సికందర్ సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2025 ఈద్ సందర్భంగా విడుదల కానుంది.
