ట్రాఫిక్ పోలీసుల తీరుతో చిన్నారి మృతి

కర్ణాటకలోని మండ్య జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసుల అవగాహనలేని తీరుతో ఓ పసికందు ప్రాణాలు కోల్పోయింది. హెల్మెట్ లేకుండా బైక్‌పై వెళ్తున్న ఓ దంపతులను పోలీసు అధిక ఉత్సాహంతో అనూహ్యంగా ఆపేందుకు ప్రయత్నించగా ఈ ప్రమాదం జరిగింది.

మద్దూరు మండలం గొరవనహళ్లి గ్రామానికి చెందిన అశోక్, వాణి దంపతులు తమ కుమార్తె ప్రతీక్షను వైద్యం కోసం మండ్య మెడికల్ కళాశాల ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో, అశోక్ హెల్మెట్ ధరించలేదని నంద సర్కిల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు బైక్‌ను హడావుడిగా ఆపేందుకు యత్నించారు. ఈ ఘటనలో బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోగా, అక్కడే ఉన్న చిన్నారి ప్రతీక్ష వెనుక నుంచి వచ్చిన టెంపో ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందింది.

పసికందు మృతితో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు, స్థానికులు రోడ్డుపై బైఠాయించి పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, బాధ్యులైన ట్రాఫిక్ పోలీసులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.

Read More :