తెలంగాణలో వర్షాల బాధితులకు ఎక్స్‌గ్రేషియా.

తెలంగాణలో కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ఉపశమనం కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ మొత్తం రూ.1.30 కోట్ల ఎక్స్‌గ్రేషియాను విడుదల చేసింది.

ప్రకటన ప్రకారం, వర్షాల వల్ల ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనుంది. పశువుల నష్టం జరిగిన కుటుంబాలకు గరిష్టంగా రూ.4 లక్షల వరకు ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయించింది. ఒకే ఒక్క గొర్రె లేదా మేక మరణించిన సందర్భంలో రూ.5,000 ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయనుంది.

ఈ సాయం కామారెడ్డి, మెదక్, ఆసిఫాబాద్, సూర్యాపేట, భువనగిరి, నిజామాబాద్, అదిలాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, ములుగు, మహబూబ్‌నగర్, సిరిసిల్ల జిల్లాలకు వర్తించనుంది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.

Read More : హైదరాబాద్‌లో చిన్నారుల కిడ్నాప్ ముఠా అరెస్ట్.

One thought on “తెలంగాణలో వర్షాల బాధితులకు ఎక్స్‌గ్రేషియా.

Comments are closed.