తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక

తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్‌లు జారీ చేసింది. రాష్ట్ర వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న ప్రకారం, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

అదే విధంగా, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

Read More : వందేభారత్‌ రైళ్లకు స్టాపేజీల కొనసాగింపు

One thought on “తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక

Comments are closed.