తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టులో మరోసారి ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలేదన్న కారణంతో ప్రధాన కార్యదర్శి (CS) కె. రామకృష్ణ రావుతో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి టి.కె. శ్రీదేవిలకు నోటీసులు జారీ చేసింది.
ఏం జరిగింది?
నారాయణపేటకు చెందిన ఓ వ్యక్తి, మున్సిపాలిటీల్లో భూమిలేని నిరుపేదలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం ప్రయోజనాలు అందించాలంటూ హైకోర్టులో పిల్ (PIL) దాఖలు చేశాడు. దీనిపై హైకోర్టు జనవరి 27న విచారణ పూర్తి చేసి, సంబంధిత శాఖలు పిటిషనర్ వినతిని పరిగణనలోకి తీసుకుని తక్షణ నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే, ఈ ఆదేశాలను ప్రభుత్వం పాటించకపోవడంతో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పిటిషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో సీఎస్, ఇతర అధికారులపై విచారణ చేపట్టిన హైకోర్టు, వారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.
Read More : ఫిల్మ్ నగర్ ఎస్ఐ రాజేశ్వర్ మృతి

One thought on “తెలంగాణ సీఎస్‌కు హైకోర్టు నోటీసులు”
Comments are closed.