తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “నావాడు, నీవాడు” అంటూ నిర్ణయాలు తీసుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఓ వ్యక్తిని బీజేపీ అధిష్ఠానం నియమించనున్నట్లు ప్రచారం జరుగుతుండగా… దీనిపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
పార్టీ అధ్యక్షుడిని నియమించే ప్రక్రియలో ప్రతి బూత్ కార్యకర్త నుంచి ముఖ్యనేత వరకు ఓటు వేసే అవకాశం ఉండాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని, ఒకే వ్యక్తి నిర్ణయంతో పదవులు కట్టబెట్టడాన్ని ఆయన వ్యతిరేకించారు.
రాజాసింగ్ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో కొత్త చర్చకు దారితీశాయి.
Read More : పఠాన్ చెరు పారిశ్రామికవాడలో భారీ పేలుడు…

One thought on “రాజాసింగ్ అసంతృప్తి: బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై వ్యాఖ్యలు”
Comments are closed.