సరోగసి కేసులో డాక్టర్ నమ్రత స్పందన

తాను ఎలాంటి తప్పు చేయలేదని, త్వరలో అన్ని విషయాలను బయటపెడతానని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత వెల్లడించారు. సరోగసి అక్రమాల కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆమెను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అంతకుముందు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం నార్త్ జోన్ డీసీపీ కార్యాలయానికి విచారణ నిమిత్తం తరలించారు. గోపాలపురం పోలీసులు ఆమెను ప్రశ్నించనున్నారు. కోర్టు ఆమెను 5 రోజులపాటు పోలీసు కస్టడీకి అనుమతించింది.

గాంధీ ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడిన డాక్టర్ నమ్రత, “నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఒక ఆర్మీ వ్యక్తి తప్పుడు ఆరోపణలు చేయడంతోనే ఈ కేసు నమోదైంది. త్వరలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి” అని అన్నారు.

సృష్టి సరోగసి అక్రమాల కేసులో డాక్టర్ నమ్రత ఏ1గా ఉన్నారు. సరోగసి పేరుతో పలువురు దంపతులను మోసం చేశారని, ఏజెంట్ల సాయంతో అసోంకు చెందిన మహిళల నుంచి పిల్లలను కొనుగోలు చేసి, వాటిని ఆ దంపతుల బిడ్డలుగా అప్పగించారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే, నిబంధనలకు విరుద్ధంగా వీర్యం, అండాలను సేకరించి ఇతర రాష్ట్రాల్లో విక్రయించినట్లు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Read More : సుప్రీంకోర్టు ఆదేశాలపై కడియం శ్రీహరి స్పందన

One thought on “సరోగసి కేసులో డాక్టర్ నమ్రత స్పందన

Comments are closed.