స్పిరిట్ సినిమా కథ లీక్ :

రెబల్ స్టార్ ప్రభాస్, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలిసి రూపొందిస్తున్న ‘స్పిరిట్’ సినిమా తాజా పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చిత్రంలో మొదటగా దీపిక పదుకొణేను హీరోయిన్‌గా ఎంపిక చేసుకోవాలనుకున్న సందీప్ రెడ్డి, కానీ ఆమె కొన్ని కండిషన్లు పెట్టడంతో ఆమెను తీసివేసినట్టు సమాచారం. దీపిక స్థానంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీని కథానాయికగా ఎంపిక చేశారు.

ఇప్పుడే దీపిక పీఆర్ టీమ్ ‘స్పిరిట్’ సినిమా కథాసారాన్ని లీక్ చేసినట్టు వార్తలు రావడంతో, సందీప్ రెడ్డి వంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డర్టీ పీఆర్ గేమ్స్’ అంటూ, ఈ విషయంపై ‘ఎక్స్’ (మునుపటి ట్విట్టర్) వేదికపై తమ అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రకటించారు.

“మీరు ఎలా చేసినా నన్ను ఏమీ చేయలేరు. ఈ సారి మొత్తం కథను లీక్ చేసుకోండి” అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆపై ‘ఇదేనా మీ ఫెమినిజం?’ అంటూ పీఆర్ టీమ్‌పై కౌంటర్‌ ఇచ్చారు.

దీనిలో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ, “నాకు నటిపై 100% నమ్మకం ఉంటుంది. మా మధ్య నాన్ డిస్కోజ్లర్ అగ్రిమెంట్ ఉంటుంది. కానీ మీరు ఇలాంటి చర్యలు చేసి కథను బయటపెట్టడం, యంగ్ నటిని కిందకు తుడిచిపెట్టడం, విమర్శించడం అనర్థకమే. సినిమా కోసం ఎన్నో సంవత్సరాలు కృషి చేస్తాం. నాకు సినిమానే ప్రపంచం. మీరు దీన్ని అర్థం చేసుకోలేరు” అని పేర్కొన్నారు.

ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సందీప్ రెడ్డి వంగా తమదైన స్టైల్లో హిందీ డైలాగ్‌తో కూడిన హ్యాష్‌ట్యాగ్ ‘డర్టీ పీఆర్ గేమ్స్’ ను కూడా జోడించారు.

Read More : విశిష్టంగా రూపొందుతున్న ‘కన్నప్ప’ సినిమా కష్టాల్లో.