గచ్చిబౌలి భూమి వివాదం పై విచారణకు హాజరైన ఐఏఎస్ స్మితా సబర్వాల్

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి సంబంధించిన ఏఐ ఫోటోను తన ఎక్స్ ఖాతాలో రీ పోస్ట్ చేసిన విషయంలో పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె విచారణకు హాజరై పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు.

సోషల్ మీడియాలో 2వేల మందికి పైగా అదే పోస్టును షేర్ చేశారని, వారందరిపై కూడా చర్యలు తీసుకుంటారా? అంటూ స్మితా సబర్వాల్ ప్రశ్నించినట్లు సమాచారం. అలా జరగకపోతే ఇది టార్గెట్ చేసినట్లవుతుందని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు.

ఇక గచ్చిబౌలి ప్రాంతంలోని కంచె భూముల వివాదం రాష్ట్రంలో పెద్ద దుమారం రేపుతోంది.

Read More : పశ్చిమ బెంగాల్ హింసపై హిందుత్వ సంస్థల ఆగ్రహం