గోవా గవర్నర్ గా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు

అమరావతి: తెలుగు వారికి గర్వకారణమైన వార్త ఇది. గోవా గవర్నర్ గా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. ఈ సందర్బంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గజపతిరాజుకు అభినందనలు తెలిపారు. గవర్నర్ గా ఆయన నియామకం ఏపీ ప్రజలకు గర్వకారణమన్నారు. గవర్నర్ గా గజపతిరాజును నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అశోక్ గజపతి విజయవంతంగా పదవీకాలం పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు.

ఇక, అశోక్ గజపతిరాజుకు మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. ఆయనకు ఈ గౌరవాన్ని అందించిన రాష్ట్రపతి, ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. నిజాయితీ, నిబద్ధతతో గవర్నర్ పదవికి అశోక్ గజపతి వన్నె తెస్తారని విశ్వసిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా అశోక్ గజపతికి శుభాకాంక్షలు తెలిపారు.