సంక్రాంతికి వస్తున్నాం: థియేటర్ నుంచి OTT, టీవీ వరకూ ఘన విజయం!

Sankranthiki Vasthunnam

విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. థియేటర్లలో హిట్ టాక్ అందుకున్న ఈ సినిమా, టెలివిజన్, ఓటిటీలో కూడా అదే జోరు కొనసాగిస్తోంది.

మార్చి 1, 2025న జీ5 ఓటీటీ మరియు జీ తెలుగు ఛానల్‌లో ప్రీమియర్ అయిన ఈ చిత్రం, డిజిటల్ స్ట్రీమింగ్‌లో 300 మిలియన్ వ్యూయింగ్ నిమిషాలను సాధించి రికార్డు స్థాయిలో స్పందన అందుకుంది. అంతేకాదు, ఓటీటీలో అందుబాటులో ఉన్నప్పటికీ, టెలివిజన్‌లో కూడా సినిమాకు భారీ రేటింగ్స్ వచ్చాయి

తాజాగా విడుదలైన TRP రేటింగ్స్ ప్రకారం, ‘సంక్రాంతికి వస్తున్నాం’ జీ తెలుగు SDలో 15.92 TRP, జీ తెలుగు HDలో 2.3 TRP సాధించి, మొత్తం 18.22 TRPతో ఘన విజయం సాధించింది. ఓటీటీ ప్రీమియర్ ఉన్నప్పటికీ, టీవీలో ఇంతటి ఆదరణ పొందడం విశేషంగా మారింది.

థియేటర్, టెలివిజన్, ఓటీటీ – అన్ని వేదికల్లోనూ రికార్డులు నమోదు చేస్తూ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కుటుంబ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఈ చిత్రం సాధించిన ఘనత, ప్రేక్షకుల ఆదరణ, టాలీవుడ్‌లో కొత్త రికార్డులను నెలకొల్పింది.

Read More

One thought on “సంక్రాంతికి వస్తున్నాం: థియేటర్ నుంచి OTT, టీవీ వరకూ ఘన విజయం!

Comments are closed.