ఆస్ట్రేలియా ప్రకృతి సౌందర్యాల్లో సమంతా – వెకేషన్ ఫోటోలు వైరల్

Samantha Australia Vacation

సమంత రూత్ ప్రభు ఇటీవల తన బిజీ షెడ్యూల్‌కు విరామం తీసుకుని ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లింది. సిటాడెల్: హనీ బన్నీ సిరీస్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సమంత, రక్త్ బ్రహ్మాండ్ సిరీస్‌తో పాటు సొంత బ్యానర్‌లో రూపొందనున్న “బంగారం” చిత్రం ప్రణాళికల్లో ఉంది. ఈ మద్యనే ఫెదర్‌డేల్ సిడ్నీ వైల్డ్‌లైఫ్ పార్క్‌ను సందర్శించిన సమంత, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కంగారూలకు ఆహారం ఇవ్వడం, నిద్రపోతున్న కోలాలను చూడటం వంటి అనుభవాల్ని ఆసక్తికరంగా షేర్ చేసింది.

“ప్రకృతి, జంతువులు.. మంచి వైబ్‌లు! వన్యప్రాణుల కోసం ఆస్ట్రేలియన్లు చేసే అద్భుత పునరావాస పనులకు అభినందనలు” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాలను పంచుకుంది.

సమంత ధరిస్తున్న కటాప్, నీలిరంగు డెనిమ్ ప్యాంట్, స్టైలిష్ బూట్లు, హ్యాట్ వంటి స్టైలిష్ లుక్ నెటిజన్లను ఆకట్టుకుంది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో హార్ట్ ఎమోజీలతో ట్రెండ్ అవుతున్నాయి. సామ్‌కు అభిమానులు, సహచర సెలెబ్రిటీలు కామెంట్స్ రూపంలో ప్రేమను, అభినందనలను వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు, సిటాడెల్: హనీ బన్నీ సిరీస్‌లో వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన సమంత, ఆ యాక్షన్-ప్యాక్డ్ సిరీస్‌లో శక్తివంతమైన నటనతో మెప్పించింది. 2024 ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డ్స్‌లో ఉత్తమ సిరీస్ (విమర్శకులు), ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డులను గెలుచుకుంది.

ప్రస్తుతం సమంత “రక్త్ బ్రహ్మాండ్” సిరీస్‌పై దృష్టి సారించడంతో పాటు, తన సొంత బ్యానర్‌లో నిర్మాణం చేపట్టనున్న “బంగారం” చిత్రంపై ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇటువంటి ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఆమె ఆస్ట్రేలియా వెకేషన్‌ను ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. సమంత ప్రస్తుతం తీసుకున్న ఈ విశ్రాంతి, భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేలా చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Read More

One thought on “ఆస్ట్రేలియా ప్రకృతి సౌందర్యాల్లో సమంతా – వెకేషన్ ఫోటోలు వైరల్

Comments are closed.