గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం కుడి చేతి గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవేర్‌నెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేస్తున్న సమయంలో చరణ్ తన కుడి చేయిని పూర్తిగా పైకెత్తలేకపోయారు. అంతేకాదు, మోచేయి భాగాన్ని షర్ట్‌తో కవర్ చేయడం ద్వారా గాయాన్ని దాచేందుకు ప్రయత్నించారు. ఈ దృశ్యాలు అభిమానుల దృష్టికి చేరడంతో, రామ్‌చరణ్ గాయపడ్డారా? అనే సందేహాలు తెరపైకి వచ్చాయి.
వెనకటి సమాచారం ప్రకారం, ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న ‘పెద్ది’ సినిమా సమయంలో ఆయన కుడి చేతికి గాయం అయినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
రామ్‌చరణ్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ, త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Read More : టాలీవుడ్‌కి డ్రగ్స్ తీసుకునే వారికి ఎంట్రీ లేదు
One thought on “గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌కు కుడి చేతికి గాయం”
Comments are closed.