సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ ఆగస్టు 14న విడుదలై భారీ హిట్టైంది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం కేవలం 14 రోజుల్లోనే 500 కోట్ల రూపాయల వసూళ్లను దాటింది. మొదట ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరుతుందని అంచనాలు ఉన్నా, కొన్ని కారణాల వల్ల ఆ స్థాయి చేరుకోలేకపోయింది. ముఖ్యంగా ఊహించిన పాత్రలు బలహీనంగా, ఊహించని పాత్రలు బలంగా కనబరచడంపై విమర్శలు వచ్చాయి.
అయినా కూడా రజనీ తర్వాత సౌబిన్ షాహిర్, రచితా రామ్ నటన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. కమల్ కూతురు రజనీ కూతురుగా కనిపించడం కూడా ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. నిర్మాణ విలువల పరంగా కూడా ఈ చిత్రం మంచి మార్కులు సాధించింది. ఇప్పటితో ఈ సినిమా విడుదలై ఒక నెల పూర్తి కానుండగా, ‘కూలీ’ ఓటీటీ రిలీజ్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ నెల 11వ తేదీ నుంచే స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. అయితే అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
ఈ సినిమాలో శ్రుతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ కీలక పాత్రల్లో నటించగా, సంగీతాన్ని అనిరుధ్ అందించారు.
Read More : కన్నడ నటి రన్యారావుకు డీఆర్ఐ భారీ జరిమానా ?
One thought on “రజనీకాంత్ ‘కూలీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ.”
Comments are closed.