వర్షంలో తడినవెంటే ఆరోగ్య జాగ్రత్తలు

వర్షాకాలం వచ్చిందంటే చల్లదనంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలకూ ఇది తలుపుతెరుస్తుంది. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వచ్చే వ్యాధులు, అలాగే జలుబు, ఫ్లూ, దగ్గు, జీర్ణ సమస్యలు, చర్మ వ్యాధులు అధికంగా వస్తాయి. అందుకే వర్షంలో తడిన వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం.

వర్షంలో తడితే వెంటనే తీసుకోవలసిన జాగ్రత్తలు:

1. తడి బట్టలు వెంటనే మార్చుకోవాలి:
వర్షంలో తడిపోతే వెంటనే బట్టలు మార్చుకోవాలి. తడి బట్టలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించి జలుబు, ఫ్లూ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. వీలైతే గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా చర్మంపై బ్యాక్టీరియా తొలగించడంలో కూడా సహాయపడుతుంది.

2. వెచ్చని పానీయాలు తీసుకోవాలి:
వర్షంలో తడిన తర్వాత గోరువెచ్చని నీరు, అల్లం టీ, తులసి టీ వంటి హెర్బల్ డ్రింక్స్ తాగడం ద్వారా శరీర వేడి నిలబడుతుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గును దూరం చేస్తాయి.

3. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోండి:
నిమ్మకాయ, నారింజ, ఆమ్లా వంటి విటమిన్ సి అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాగే టమాటా సూప్, కూరగాయల సూప్‌లు శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా శక్తిని కూడా అందిస్తాయి.

4. పాదాలు వెచ్చగా ఉంచండి:
తడిగా ఉన్న పాదాలు జలుబు, దగ్గుకు కారణమవుతాయి. కాబట్టి పాదాలను గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి 10–15 నిమిషాలు నానబెట్టాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచి అలసటను తగ్గిస్తుంది.

ముగింపుగా:
వర్షాకాలంలో చిన్న జాగ్రత్తలు కూడా పెద్ద వ్యాధుల నుంచి కాపాడగలవు. అందుకే తడిన వెంటనే ఈ నాలుగు ముఖ్యమైన చిట్కాలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Read More : చక్కెర మానేస్తే శరీరంలో జరిగే కీలక మార్పులు

One thought on “వర్షంలో తడినవెంటే ఆరోగ్య జాగ్రత్తలు

Comments are closed.